బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 20:46:32

ప్రముఖ నృత్యకారుడు టంగుటూరి భీమన్‌ ఇక లేరు

ప్రముఖ నృత్యకారుడు టంగుటూరి భీమన్‌ ఇక లేరు

  • శోక సంద్రంలో ఇందూరు కళాకారులు       

నిజామాబాద్‌ : ప్రముఖ ఆంధ్రనాట్యాచార్యులు, ఇందూరు తొలితరం నాట్య గురువు, అంతర్జాతీయ పేరణి, భరతనాట్యం, కూచిపూడి నృత్య కళాకారుడు టంగుటూరి భీమన్‌(70) ఇకలేరు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నిజామాబాద్‌ నగరంలోని ద్వారకానగర్‌లో నివాసముండే భీమన్‌ ఇంటికి శిష్యులు వచ్చి పిలువగా ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి మరణించి ఉన్నారు. భీమన్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇందూరు కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

భీమన్‌కి 1400 పైచిలుకు శిష్యులు ఉన్నారు. పేరిణి సృష్టికర్త పద్మశ్రీ నటరాజ్‌ రామకృష్ణన్‌ దగ్గర భీమన్‌ శిష్యరికం చేశారు. జీవితాంతం కళ కోసం బతికిన స్వార్థం లేని కళాకారుడు భీమన్‌. తన జీవితాన్ని కళ కోసం త్యాగం చేసిన గొప్ప మనిషి. భీమన్‌కు భార్య, కూతురు ఉన్నారు. గతంలోనే భార్య మృతి చెందారు. కాగా సోమవారం సాయంత్రం భీమన్‌ స్వస్థలం తిర్మన్‌పల్లి గ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కళాకారులు, భీమన్‌ అభిమానాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమన్‌ మృతి కళాకారులకు తీరని లోటు అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 


logo