శనివారం 11 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 14:04:59

నియంత్రిత సాగుతోనే అధిక దిగుబడులు

నియంత్రిత సాగుతోనే అధిక దిగుబడులు

మహబూబ్ నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటుపడుతుందని,  రైతులను రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మిడ్జి ల్ మండలం కొత్తూరు లో ఆరుకోట్ల రూపాయలతో చేపట్టనున్న చెక్ డ్యాం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ విధానంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

అధిక దిగుబడులు ఉన్న పంటలు వేయడం వల్ల రైతులు లాభాలు పొందవచ్చని తెలిపారు. నియంత్రిత వ్యవసాయ విధానమే దీనికి పరిష్కారమని గుర్తుచేశారు. మండలంలోని ఐదు క్లస్టర్ లకు 5 భవనాలు, రైతు భవనాల స్థల సేకరణ పూర్తి అయిందని, త్వరలోనే ఐదు రైతు భవనాల బిల్డింగ్ లను పూర్తి చేస్తామన్నారు.

 


logo