గురువారం 09 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 11:27:03

ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కరోనా నెగిటివ్‌

ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కరోనా నెగిటివ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. శ్రీనివాస్‌ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కమిషన్‌ చైర్మన్‌కు నెగిటివ్‌ రావడంతో.. ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి ఎర్రోళ్ల హోంక్వారంటైన్‌లో ఉన్నారు. 

రాష్ట్రంలో శనివారం రికార్డుస్థాయిలో 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 179 ఉండగా, సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్‌ మల్కాజిగిరి 14, రంగారెడ్డి 11, మహబూబ్‌నగర్‌ 4, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, నల్లగొండ, ములుగు, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండు చొప్పున, సిద్దిపేట, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

కరోనా తీవ్రతకు తోడు ఇతర వ్యాధులతో బాధపడుతున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,737 కేసులు నమోదుకాగా, ఇందులో 182 మంది మరణించారు. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం వంటి కారణాలతోనే రాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.


logo