సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 03:22:52

ప్రేమే గెలిచింది..

ప్రేమే గెలిచింది..

కనగల్: ‌  కుదిర్చిన పెళ్లి జరిగిపోయింది. ఒడి బియ్యం పోసి సాగనంపే సమయంలో పందిట్లోకి   ప్రియుడి వద్దకు వెళ్లి ‘నువ్వే కావాలి’ అంటూ పెళ్లి కూతురు రోదించింది.  పెండ్లి కుమారుడు, అత్తమామలు, బంధువులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తెగదెంపులు చేసుకుని వెళ్లగా.. శనివారం ప్రియుడితో మళ్లీ పెళ్లి జరిగింది. సినిమా సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన శనివారం కనగల్‌ మండలం  జరిగింది.

   పేమించిన  పెండ్లి చేసుకోవాలని ఆ యువతి నిర్ణయించుకుంది. తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టాలని ఆమె తల్లి ఆశించింది.తెలిసిన వారితో సంబంధం కుదుర్చుకుని బంధువుల సమక్షంలో వివాహం జరిపించారు.    పియుడి వద్దకు వెళ్లి నువ్వే కావాలనిపెండ్లి కూతురు పట్టుబట్టింది.  వరుడితో తెగదెంపులు చేసుకుని ప్రియుడితో మళ్లీ పెళ్లి చేశారు.  ఘటన కనగల్‌ మండలం  గ్రామంలో చోటుచేసుకుంది.

కురంపల్లి గ్రామానికి చెందిన  పద్మ కుమార్తె మౌనికకు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో శుక్రవారం పెళ్లి జరిపించారు.  పెళ్లి కూతురిని సాగనంపే క్రమంలో మౌనికకు  మామ అయిన దేవరకొండ మండలం గోనబోయినపల్లికి చెందిన రాజు (తన ప్రియుడు) అక్కడికి రావడంతో నువ్వే కావాలంటూ అతని వద్దకు వెళ్లి  కన్నీటి పర్యంతమైంది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు నివ్వెరపోయారు. పెండ్లి కుమారుడి తల్లిదండ్రులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

ప్రియుడితో  పెళ్లి..

పెండ్లి పందిట్లోంచి ప్రియుడి వద్దకు చేరిన మౌనికకు శనివారం దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద కోరుకున్నవాడితో  వివాహం   వరుడితో అన్నీ తెగదెంపులు చేసుకున్న గంటల్లోనే పెద్దల సమక్షంలో పెండ్లి చేశారు. రెండ్రోజుల నుంచి జరుగుతున్న ఈ తతంగాన్ని చూసిన వారందరూ ఒకింత  గురయ్యారు. 


logo