శనివారం 04 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:18:24

నాదర్‌గుల్‌లో చిరుత సంచారం

  నాదర్‌గుల్‌లో చిరుత సంచారం

బడంగ్‌పేట : హైదరాబాద్‌ శివారులోని బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌ పరిధిలోని జయసూర్యపట్నం, ఆనంద్‌ నగర్‌ కాలనీల్లో చిరుతపులి సంచరించినట్టు తెలిసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి చిరుత సంచరించినట్టు ఉన్న అడుగుల ఫొటోలను పరిశీలించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆందోళన పడవద్దని, చిరుత కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.


logo