ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 16:57:11

రైతు వేదికల నిర్మాణం..ప్రగతికి సోపానం

రైతు వేదికల నిర్మాణం..ప్రగతికి సోపానం

ఖమ్మం: వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేటలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు వేదికలు నిర్మించటం  రైతు బంధు,  రైతు బీమా,  రుణమాఫీ  చేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్,  జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,  జిల్లా కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు


logo