శనివారం 11 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 15:47:27

బీడు భూములను సాగు భూములుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

బీడు భూములను సాగు భూములుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

సిద్దిపేట ‌: రైతుల ఆర్థికాబివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో నియోజక వర్గంలోని తొగుట దుబ్బాక, చేగుంట, దౌల్తాబాద్‌ మండలాల నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో పాటు పాలక వర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని వారు విమర్శించారు. వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించి ఎడారిగా ఉన్న భూములను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏఎంసీ చైర్మన్లు పాలక వర్గ సభ్యులు రైతుల సమస్యల పరిష్కరంలో ముందుండాలని పేర్కొన్నారు.


logo