బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 00:26:08

ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై కేసు నమోదు

 ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై కేసు నమోదు

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కట్టడిలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుండగా ... సామాజిక దూరం పాటించేందుకు జన సమూహం ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ కు అనుమతి ఇవ్వలేదు. సర్కార్ నిబంధనలు పాటించనివారిపై కఠినచర్యలు చేపడుతున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కీసర మండలం భోగారంలోని అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో గురువారం పెండ్లి జరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది ఈ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాల్‌కు వెళ్లి పరిశీలించారు. పెండ్లికి వచ్చినవారిలో ఎక్కువ మంది మాస్కులు ధరించలేదు. దీంతో ఫంక్షన్‌హాల్‌ యజమాని పై పోలీసులు కేసు నమోదు చేశారు.


logo