మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 18:22:01

పడగవిప్పిన నాగుపాము.. భయపడ్డ కూలీలు..

పడగవిప్పిన నాగుపాము.. భయపడ్డ కూలీలు..

నిర్మల్‌ : నాగుపాము అంటేనే అందరూ హడలిపోతారు.. దాన్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది. అది పడగ విప్పి బుసలు కొడుతుంటే.. దూరాన పారిపోతాం.. మరి అలాంటి నాగును చూసిన కూలీలు ఒక్కసారిగా భయపడిపోయారు. 

బాసర రైల్వే స్టేషన్‌ నుంచి ఐఐఐటీకి వెళ్లే మార్గంలోని ఓ రైతు తన పంట పొలంలో కూలీలతో పని చేయించుకుంటున్నాడు. అంతలోనే ఓ నాగుపాము బుసలు కొడుతూ.. పడగ విప్పింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన రైతు, కూలీలు.. అక్కడ్నుంచి పారిపోయారు. పొలంలో నుంచి పాము వెళ్లకపోయేసరికి.. పాములు పట్టే వ్యక్తికి రైతు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి రాము.. కర్రతో ఆడిస్తూ దూరంగా తీసుకెళ్లి వదిలేశాడు. దీంతో రైతు, కూలీలందరూ ఊపిరి పీల్చుకున్నారు. రామును కొనియాడారు.  


logo