ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 16:27:30

సిద్దిపేటలో తొమ్మిదో తరగతి విద్యార్థికి కరోనా

సిద్దిపేటలో తొమ్మిదో తరగతి విద్యార్థికి కరోనా

సిద్దిపేట : జిల్లాలో మరోసారి కరోనా కేసులు కలకలం సృష్టించాయి. మిరుదొడ్డి మండల పరిధిలోని జంగంపల్లి గ్రామానికి చెందిన జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అఖిల్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇరవై రోజుల నుంచి హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. అఖిల్ కు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకిందని మిరుదొడ్డి, భూంపల్లి దవాఖాన వైద్యాధికారి మల్లికార్జున్ వెల్లడించారు. 


logo