శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 16:21:55

తొలకరితో..ఊపందుకున్న ఎవుసం

తొలకరితో..ఊపందుకున్న ఎవుసం

హైదరాబాద్ : మేఘం కరిగి..రుతువై కురియడంతో రాష్ట్రంలోని అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. తొలకరితో పులకరించిన రైతు దుక్కులు దున్నుతూ.. విత్తనాలు వేస్తూ వానకాలం పంటల సాగును ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉదయమే పొలాల్లోకి వెళ్లిన రైతులు అరక కట్టి, పూజలు చేసి విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. రైతుల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ పెట్టుబడి కోసం రైతుబంధు పథకంతో పాటు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచారు. దీంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి.


గతంలో విత్తనాల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టి ఎదురు చూసే దశ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతల చెంతకు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తేవడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం చెప్పిన విధంగా నియంత్రిత సాగు విధానంలో పంటలు వేసేందుకు మొగ్గుచూపుతున్నారు.logo