గురువారం 16 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 14:50:49

ఆదిలాబాద్ అందాలు.. ఆకుపచ్చని సోయగం

ఆదిలాబాద్ అందాలు.. ఆకుపచ్చని సోయగం

ఆదిలాబాద్ : కనుచూపు మేరలో పరుచుకున్న పచ్చదనం. పక్షుల కిలకిలరావాలు. హోయలొలికే ప్రకృతి సోయగం. ప్రకృతి అందాలకు పేరుగాంచిన జిల్లాలో తొలకరి చినుకులు కురుస్తుండటంతో..చెట్లు ఆకుపచ్చని సోయగాల్ని పులుముకుంటూ.. అందాలతో కనువిందు చేస్తున్నాయి. 

పుడమి తల్లి పచ్చని కోక ధరించినట్లుగా చూపురులను పరవశింపజేస్తున్నది. అంతేకాదు మబ్బులతో కూడిన ముసురు పడుతుండటంతో అటవీ ప్రాంతాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆకుపచ్చని అందాలకు తోడు మహబూబ్ ఘాట్ గుట్టల్లో కురుస్తున్న మంచు కశ్మిర్‌ అందాలను తలపిస్తూ సరికొత్త అనుభూతుల్ని పంచుతున్నది. ఈ రహదారిన వెళ్తు్న్న ప్రయాణికులు ప్రకృతి అందాలకు పరవశించిపోయి..తమ వాహనాలను ఆపి మరి ముగ్ధమనోహరమైన ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు.logo