మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 16:44:20

గోమాతకు అంత్యక్రియలు నిర్వహించి.. రుణబంధం తీర్చుకొని

 గోమాతకు అంత్యక్రియలు నిర్వహించి.. రుణబంధం తీర్చుకొని

నిర్మల్ : ఆవు ఆ రైతన్న ఇంట్లో కుటుంబ సభ్యుల లెక్క మెదిలింది.15 ఏండ్లుగా వారితో కలిసి పోయింది. ఆర్థికంగా చేయూతనిచ్చింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ గోమాత, మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆ రైతు నర్గోల్ల విఠల్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆవుతో అనుబంధాన్ని తలుచుకుంటూ కుమిలిపోయారు. తమకు అందించిన సేవలకు గుర్తుగా సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా తానూరులో చోటు చేసుకుంది.


logo