ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 16:02:20

అన్నదాతల ఆత్మబంధువు సీఎం కేసీఆర్

అన్నదాతల ఆత్మబంధువు సీఎం కేసీఆర్

ములుగు: వ్యవసాయం పండగ కావాలని, రైతును రాజు చేయడమే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎవరూ చేయని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని పస్రా, చల్వాయి, మచ్చాపూర్ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

 కరోనా కష్టకాలంలో కూడా రైతులు నష్టపోకూడదని పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నేడు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి రైతు వద్దకు వచ్చి వారి కోసం పనిచేస్తున్నారని, గత పాలకులు ఈ విధంగా ఒక క్వింటా అయినా కొనుగోలు చేశారా? అని ప్రశ్నించారు. రైతు గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు.ఒక వైపు మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం ఆర్థికంగా రాష్ట్రం నష్టపోతున్నా లాక్ డౌన్ అమలు చేసి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యవసాయానికి, రైతుకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

 రైతును రాజు చేయడానికి ప్రాజెక్టుల ద్వారా నీరిస్తున్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ , రైతు బంధు, రైతుబీమా ఇస్తున్నారని, ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చి నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడ గోదావరి ఉన్నా ఇంకా కొన్ని గ్రామాలకు నీరు రావడం లేదని చెబుతున్నారని, త్వరలోనే లక్నవరం ద్వారా నీరు వచ్చేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, దాదాపు 1500 ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.Ashok Putta        Date : 8-6-20logo