ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 14:57:26

ఆదిలాబాద్ లో నకిలీ బీటీ-3 విత్తనాల పట్టివేత

ఆదిలాబాద్ లో నకిలీ బీటీ-3 విత్తనాల పట్టివేత

ఆదిలాబాద్ : పట్టణంలోని రాంనగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్ నగర్ కు చెందిన షేక్ మహరాజ్, మహమ్మద్ ముస్తఫాలు ఇటీవల మధ్యప్రదేశ్ కు చెందిన కాలుసింగ్ అనే వ్యక్తి నుంచి నకిలీ విత్తనాలను తీసుకువచ్చినట్లు గుర్తించారు. పోలీసులు వారి ఇండ్లలో దాడులు నిర్వహించి 785 విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

వీటి విలువ సుమారు రూ. 5.5 లక్షలు ఉంటుందని ఎస్పీ విష్ణు వారియర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో నకిలీ విత్తనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ,10 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు తక్కువ ధరకు విత్తనాలు అమ్మే వారిని నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠన చర్యలు తీసుకుంటామన్నారు. పీడీ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఆయన కోరారు.


logo