శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 13:15:27

పల్లె ప్రగతితో..అభివృద్ధి పరవళ్లు

పల్లె ప్రగతితో..అభివృద్ధి పరవళ్లు

జగిత్యాల : గత ప్రభుత్వాల పాలనలో కంటే టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలు పరిశీలించాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పల్లెప్రగతితో గ్రామాల్లో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని పేర్కొన్నారు. ఇండ్లను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. లేదంటే వర్షాకాలంలో తొందరగా వ్యాధులు వ్యాపి చెందుతాయని పేర్కొన్నారు.

పల్లెల అభివృద్ధి కోసమే పల్లెప్రగతి కార్యక్రమం అని తెలియజేశారు. రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ. 30 వేల కోట్లు పెట్టి వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో కరెంటు, ఎరువుల కోసం నిత్యం ధర్నాలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించండని ప్రజలను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆగే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని నిధులు కావాలో అన్ని సమకూర్చుతానని అభివృద్ధి పనులు చేయించుకోండని మంత్రి హామీ ఇచ్చారు.


logo