శనివారం 11 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 22:28:58

ఆర్ఆర్ ట్రేడర్స్ వెబ్ సైట్ నుఆవిష్కరించిన మంత్రి ఈటల

 ఆర్ఆర్ ట్రేడర్స్ వెబ్ సైట్ నుఆవిష్కరించిన మంత్రి ఈటల

హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఆర్ఆర్ ట్రేడర్స్ సంస్థ సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా అన్నిరకాల వైద్య సామాగ్రి అందించనున్నది. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ఆర్ఆర్ ట్రేడర్స్ వెబ్ సైట్ ను , పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆర్ఆర్ ట్రేడర్స్ వ్యవస్థాపకుడు కలహార్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ అవసరాలను గుర్తించి మెరుగైన సేవలు అందించడానికి తమ సంస్థ సిద్ధమైందని చెప్పారు. నాణ్యమైన  మెడికల్ ఎక్విప్ మెంట్ తమ వద్ద అందుబాటు ధరలో లభిస్తుందని ఆయన తెలిపారు. ఆర్ఆర్ ట్రేడర్స్ గత ఎనిమిదేండ్ల నుంచి ఉత్తమ వ్యాపార సంస్థగా పలు  అవార్డులు అందుకున్నది. 

Previous Article రాశి ఫలాలు
Next Article వాస్తు

logo