గురువారం 09 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 22:21:03

నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు పట్టివేత

నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు పట్టివేత

పెంబి: నిర్మల్‌ జిల్లా పెంబి మండలం శెట్‌పల్లి గ్రామంలో 240 నకిలీ విత్తన ప్యాకెట్లను ఎస్‌ఐ సాముల రాజేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు, వ్యవసాయశాఖ సిబ్బంది పట్టుకున్నారు. చిక్రం జలపతి (41) ఇంట్లో మహశక్తి కంపెనీకి చెందిన 140 ప్యాకెట్లు, జై అంబే కంపెనీకి చెందిన 100 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. మండల వ్యవసాయాధికారి వినోద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జలపతిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.


logo