సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 14:42:32

అరకపట్టి చెల‌క దున్ని..మట్టితో మమేకమై

అరకపట్టి చెల‌క దున్ని..మట్టితో మమేకమై

సూర్యాపేట : తొలకరి చినుకులు పడుతుండటంతో జిల్లాలో రైతులు ఉత్సాహంగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి పూజల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని పాడికి  పూజలు చేసి, నాగలి పట్టి పొలం దున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్వ కాలం నుంచి రైతులు ఏరువాకను సంతోషాల నడుమ  జరుపుకునేవారని, సమైక్య పాలకులు తెలంగాణలోని వ్యవసాయాన్ని ధ్వసం చేసి, రైతులను నట్టేట ముంచడంతో ఏరువాక లాంటి పండుగలకు రైతులు దూరం అయ్యారని మంత్రి తెలిపారు.

స్వయాన రైతైన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో 24 గంటల కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు ఇతర ప్రాజెక్ట్ లను పూర్తి చేయడంతో  కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా రైతుల దశాబ్దాల కలగా మారిన గోదావరి జలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వందలాది మంది రైతులతో నాగలి పట్టి, పొలం దున్నడం సంతోషంగా ఉందని, మట్టితో మమేకమై ప్రకృతితో కలిసి వ్యవసాయం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదని మంత్రి తెలిపారు


logo