ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 17:48:04

టీఆర్‌ఎస్‌ హయాంలోనే మున్సిపాలిటీలకు మహర్దశ

టీఆర్‌ఎస్‌ హయాంలోనే మున్సిపాలిటీలకు మహర్దశ

మేడ్చల్ మల్కాజిగిరి : పీర్జాదిగూడ నగర పాలక సంస్థను నెంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతామని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం పిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. నగర పాలక పరిధిలో దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో బోడుప్పల్‌లో బీటీ రోడ్లు, బుద్ధనగర్‌లో వర్షపు నీటి కాలువ నిర్మాణం పనులు, బుద్ధనగర్‌ విష్ణుపురి కాలనీలలో పార్కు స్థలానికి ప్రహరీ గోడ, కేఎల్‌ఎం ప్రధాన రోడ్డులో బీటీ రోడ్డు, మేడిపల్లి నుంచి పర్వతాపూర్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణపు పనులను ప్రారంభించారు.  

అనంతరం పీర్జాదిగూడ నగర పాలక సంస్ధ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మున్సిపాలీటీలు, కార్పొరేషన్‌లు అధివృద్ధి చెందుతున్నాయన్నారు. 

హరితహారం కార్యక్రమలో భాగంగా మొక్కలు నాటి ఆకుపచ్చ పీర్జాదిగూడగా మార్చుకోవాలన్నారు. పీర్జాదిగూడన నగర పాలక సంస్ధ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. పీర్జాదిగూడ నగర పాలక సంస్థ‌ పరిధిలో రోజు రోజుకు జనాభా పెరగడంతో దానికి అనుగుణంగా ప్రధాన రోడ్లను విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


logo