ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 13:44:49

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మేయర్ రామ్మోహన్

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మేయర్ రామ్మోహన్

హైదరాబాద్ : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గోల్నాకా డివిజన్ లో అలీ కేఫ్ చౌరస్తా దగ్గర ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ కాలేరు పద్మ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ వేణుగోపాల్ తో కలిసి మేయర్ పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్ లో పాల్గొన్నారు. మట్టి కుప్పలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరంలో ఈ ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కుండీల్లో నిల్వ నీటిని తొలిగించాలని తడి, పొడి చెత్తను వేరు చేస్తూ ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ వో హేమలత, ఈఈ ఆశాలత, డీపీవో రజిత, ఏఈ సంతోష్, పారిశుద్ధ్య సూపర్ వైజర్లు, కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


logo