సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 17:52:33

అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు

 అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు

రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అల్మాస్‌గూడ 25వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్ గా గెలిచిన ముత్యాల లలిత మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నూతన కమిటీలను వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకపోవాలన్నారు. 


logo