ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 17:31:55

క‌రోనా కట్టడిలో సీఎం కేసీఆర్ కృషి ప్రశంసనీయం

క‌రోనా కట్టడిలో సీఎం కేసీఆర్ కృషి ప్రశంసనీయం

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖ‌జానాని సైతం లెక్క చేయ‌క‌ ప్రజల ప్రాణాలే ముఖ్యమ‌ని అనేక సాహ‌సోపేత నిర్ణయాలు తీసుకుంటున్నార, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నకృషికి  త‌న వంతు బాధ్యతగా యాదాద్రి జిల్లాలోని చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మందడి లక్ష్మీనరసింహా రెడ్డి రూ.2 ల‌క్షల విరాళం ప్రకటించారు. ఇటీవల మంత్రి ఎర్రబెల్లికి అందించిన విరాళం చెక్కుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సంద‌ర్భంగా విరాళం అందజేసిన లక్ష్మీనరసింహా రెడ్డిని మంత్రులు అభినందించారు.


logo