శనివారం 04 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 16:12:29

అన్నార్థులను ఆదుకుందాం..మానవత్వాన్ని చాటుదాం

అన్నార్థులను ఆదుకుందాం..మానవత్వాన్ని చాటుదాం

హైదరాబాద్ : నిరుపేదలను ఆదుకునే సేవా నిరతిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని, తమకు అందుబాటులో ఉన్న అన్నార్థులకి అన్నం పెట్టడమే సేవకు అసలైన పరమార్థం అని పంచాయతీరాజ్శా ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. హైదరాబాద్ కార్యాలయంలో తన పేషీలో పని చేస్తున్నచిరు ఉద్యోగులు, ఇతర వర్కర్లకు మంత్రి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ మిగిల్చిన అనేక సమస్యలతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మన రాష్ట్రాన్ని భద్రంగా ఉంచాయన్నారు. ఈ కష్ట కాలంలో పేదలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అయినా ప్రభుత్వం 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 ఇచ్చి ఆదుకుందని తెలిపారు. కేవలం ప్రభుత్వం మాత్రమే అన్నీ చేయలేదని, దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. తనకు తోచిన, సాధ్యమైన రీతిలో సాయ పడుతున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.


logo