సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 14:07:30

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

వికారాబాద్ : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. రైతు కష్టాలు తెలిసిన, నిజమైన రైతు బిడ్డ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గ కేంద్రంలో వానాకాలం 2020 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక,నూతన వ్యవసాయ విధానం పై డివిజన్ స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికారాబాద్ లో 28 వేల ఎకరాల్లో మొక్క జొన్న వేస్తే, 1760 రూపాయల కు ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. పంట మార్పిడి తో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు.

 కూరగాయలు, వరి, పత్తి, కంది లాంటి పంటలతో రైతుకు లాభం చేకూరుతుందన్నారు.రైతుల కోసమే రైతు వేదికలు ప్రభుత్వం నిర్మిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థాయికి రైతు ఎదగాలన్నారు. రైతును రాజును చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్ రెడ్డి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo