మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 16:47:55

నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో మేలు

నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో మేలు

సూర్యాపేట : సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో మేలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ ఎస్ మండలం నంద్యాలవారి గూడెంలో నియంత్రిత సాగుపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. పంటల మార్పిడితో అధిక ఆదాయం పొందవచ్చన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కందికి రంది లేదని, సోయాబీన్ కు మంచి డిమాండ్ ఉందని రైతులకు వివరించారు. పామాయిల్ వంటి పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే అందుకు అనుగుణంగా ఆయిల్ తయారు చేసే కర్మాగారం పెట్టించడం సులబమేనని ఆయన తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్న నియంత్రిత సాగులో భాగస్వామ్యం అవుతామంటూ వారు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే ఈ వానాకాలంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని, మరో 15 రోజుల్లో నీళ్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.


logo