మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 16:23:38

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్

మంచిర్యాల: రైతులు, పేద ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్  ప్రభుత్వం పాటు పడుతుందని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజకవర్గం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే క్యాతన్ పల్లిలో రైతు వేదిక పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న నిత్య కృషీవలుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హొళికేరి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తదితరులు  పాల్గొన్నారు.


logo