గురువారం 02 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 14:49:50

రోహిణీ కార్తెలో సాగు..అన్నదాతలకు ఎంతో బాగు

రోహిణీ కార్తెలో సాగు..అన్నదాతలకు ఎంతో బాగు

కరీంనగర్ : రోహిణీ కార్తిలో సాగు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో సన్నరకాల మొలక అలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచించిన విధంగా రైతులు ముందస్తు సాగుకు సిద్ధం కావాలన్నారు. సకాలంలో సాగు చేస్తే పంటలు చీడ పీడల బాధ తగ్గి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్నపంటలు వేసి అధిక లాభాలను గడించాలన్నారు.


logo