మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 12:30:16

సబ్బండ వర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

సబ్బండ వర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

నిర్మల్ : ఉద్యమ నాయ‌కుడు కేసీఆర్ నేతృత్వంలో అలుపెరుగని పోరాటం, అమరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క‌లెక్టరేట్  కార్యాల‌యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంత‌కుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమ‌ర‌వీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు వృథా కానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేన్నారని మంత్రి తెలిపారు. 

పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి కేవలం ఆరేండ్లలో యావత్‌ దేశమే ఆశ్చర్యపోయేలా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘ‌న‌త టీఆర్ఎస్ ప్రభుత్వానికే ద‌క్కుతుందున్నారు. కాళేశ్వర నిర్మాణం,పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో నేడు తెలంగాణ ఎంతో సుభిక్షంగా మారిందని పేర్కొన్నారు.


logo