ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 11:22:06

అమరుల త్యాగాలు స్మరిస్తూ..మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భావోద్వేగం

అమరుల త్యాగాలు స్మరిస్తూ..మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భావోద్వేగం

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ దవాఖానలో చావు బతుకుల మధ్య వున్నఅంశాన్ని, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరించి మంత్రి మాట్లాడారు. తెలంగాణా ఆషామాషీగా రాలేదని, వందల మంది ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగాన్ని కొనసాగించారు.

రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. సంక్షేమ రంగాల్లో పాలమూరు దూసుకుపోతుందని తెలిపారు. వలసల నివారణ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని మంత్రి తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు కేసులు వేసి ప్రాజెక్టును ఆలస్యం చేశాయన్నారు. అమరుల కుటుంబాలను మంత్రి ఈ సందర్భంగా సన్మానించారు. 


logo