మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 01, 2020 , 16:00:26

గ్రామాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి మల్లారెడ్డి

గ్రామాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మాల్కాజిగిరి : గ్రామాల్లో పరిశుభ్రతను పెంచి అంటు వాధ్యుల నుంచి ప్రజలను దూరం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా, ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల గ్రామంలో నిర్వహించి పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గ్రామాలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమన్నారు. గ్రామాలు  పరిశుభ్రంగా ఉంటేనే, గ్రామ ప్రగతి సాధ్యం అవుతుందని మంత్రి వివరించారు. 

 ముగురు కాలువలు, చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే, ఎలాంటి అంటు వ్యాధులు దరిచేరవని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అడిషన్‌ కలెక్టర్‌ శాంసన్‌, సీఈవో దేవసహాయం తదితరులు 


logo