శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 01, 2020 , 15:49:53

రైల్వేస్టేషనల్లో భారీ క్యూలు లైన్లు

 రైల్వేస్టేషనల్లో భారీ క్యూలు లైన్లు

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు నేటి నుంచి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైల్వేస్టేషనల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. సికింద్రాబాద్ మెయిన్ జోన్ గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొమ్మిది రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. రైలు బయలుదేరే సమయంకు గంట ముందే స్టేషన్ కు చేరుకోవాలని రైల్వే శాఖ పేర్కొనడంతో  వేలాది మంది ప్రయాణికులు గంటన్నర ముందే స్టేషన్ కి చేరుకుంటున్నారు. ఇక ఆరోగ్య పరీక్షలు చేసి, టికెట్ కన్ఫాం అయిన వారిని మాత్రమే పోలీసులు స్టే షన్ లోపలికి పంపుతున్నారు. వేల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో క్యూ  లైన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక స్టేషన్‌ లోపల ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేల మీద గీతలు వేశారు. స్టేషన్‌ కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపిస్తున్నారు.  


logo