శనివారం 04 జూలై 2020
Telangana - May 31, 2020 , 15:00:44

వికారాబాద్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

వికారాబాద్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

వికారాబాద్ జిల్లా: కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తున్నది. తాజాగా యాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు యాలాల మండల వైద్యాధికారి ధ్రువీకరించారు. వీరంతా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చి గత 22 రోజుల క్రితం కర్ణాటకలోని గురుమిట్కల్ వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉన్నారు. అయితే ఈ రోజు దౌలాపూర్ కు చేరుకున్న తర్వాత ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వికారాబాద్ జిల్లా వైద్యాధికారికి  సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి చెరుకున్న వైద్యాధికారులు కరోనా సోకిన వారిని దవాఖానకు తరలించేదుదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.logo