శనివారం 11 జూలై 2020
Telangana - May 28, 2020 , 17:36:58

మెదక్ జిల్లాలో గొర్రెల మందపై చిరుతదాడి

మెదక్ జిల్లాలో గొర్రెల మందపై చిరుతదాడి

రామాయంపే : అడువుల్లో ఉండాల్సిన చిరుత పురులు జనారణ్యంలోకి ప్రవేశించి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఓ గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తొనిగండ్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సూరన్నగారి భూపాల్‌కు గ్రామ శివారులో తన కొట్టంలో గొర్రెల మందను ఏర్పాటు చేసుకున్నాడు.

ఎప్పటిలాగానే తన జీవాలను కొట్టంలో ఉంచి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు.పొద్దున కొట్టంలోకి వెళ్లి చూడగా ఒక గొర్రె చనిపోగా రెండు గొర్లు కొన ఊపిరితో రక్తపు మడుగులో ఉన్నాయి. వెంటనే గ్రామస్తులకు తెలిపాడు. సర్పంచ్‌ పిట్ల రాణమ్మ, సంఘటనా స్థలానికి  వెళ్లి రామాయంపేట ఎఫ్‌ఆర్‌వో విష్ణువర్దన్‌ రెడ్డికి ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎఫ్‌ఆర్‌వో ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకుంటామని తెలిపారు. గత ఎనిమిది నెలలుగా రాని చిరుత మళ్లీ గ్రామ శివారుకు వచ్చి పశువులపై దాడులు చేయడం తో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 


logo