మంగళవారం 07 జూలై 2020
Telangana - May 28, 2020 , 16:41:55

మత్తడి దుంకుతున్నచెరువులు..మురిసిపోతున్న ప్రజలు

మత్తడి దుంకుతున్నచెరువులు..మురిసిపోతున్న ప్రజలు

సిద్దిపేట : కాళేళ్వంర ప్రాజెక్ట్ తో వట్టి పోయన చెరువులు జీవకళను సంతరించుకుంటున్నాయి. నీళ్లు లేక నెర్రెలు వాసిన చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. అపర భగీరథ ప్రయత్నంతో తెలంగాణ ప్రజల దాహార్తిని తీరుస్తున్న సీఎం కేసీఆర్ కు జనం జేజేలు పలుకుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటనలో చెరువుల మత్తడి పోస్తుండటంతో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గంగమ్మ తల్లికి క్షీరాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలతో మన బీడు భూములు సస్యశామలం కానున్నాయన్నారు. మండుటెండల్లో సైతం చెరువులు గోదావరి జలాలతో పరవళ్లు తొక్కతుండటం అద్భుతంగా ఉందన్నారు. వ్యవసాయానికి సాగు నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న, ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు సాగు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచ్‌ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo