ఆదివారం 12 జూలై 2020
Telangana - May 28, 2020 , 12:56:22

హైదరాబాద్‌లో ఇన్‌డ్రైవర్ సేవలు పునః ప్రారంభం

హైదరాబాద్‌లో ఇన్‌డ్రైవర్ సేవలు పునః ప్రారంభం

 హైదరాబాద్:  ప్రముఖ ట్యాక్సి సర్వీస్ యాప్ ఇన్‌డ్రైవర్ లాక్‌డౌన్ 4 మార్గదర్శకాలకనుగుణంగా తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో పునరుద్ధరించింది. ఈ రోజు నుంచి వినియోగదారులు తమ రైడ్స్‌ను బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది . అంతే కాకుండా ఇన్‌డ్రైవర్‌తో ఆదాయం పొం దాలనుకునే వాహనదారులు తమ సేవలను కొనసాగించవచ్చని తెలిపింది. "దాదాపు రెండునెలల పాటు సేవలను నిలిపివేయడం వల్ల తామిప్పుడు తమ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నాము. అయితే , కోవిడ్-19 ప్రమాద తీవ్రత  ఇంకా తగ్గలేదు కాబట్టి అందరూ తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నది.  డ్రైవర్లు , ప్రయాణీకుల భద్రత చాలా ముఖ్యమని " ఇన్‌డ్రైవర్  ఇండియా పీఆర్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ పవిత్ నంద అన్నారు. ఇన్‌డ్రైవర్ భాగస్వాములతో పాటు, ప్రయాణీకులు సైతం అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి చేశామని పవిత్ నంద పేర్కొన్నారు.

ఇన్‌డ్రైవర్‌పై తమ ప్రయాణాలను బుక్ చేసుకునే వినియోగదారులు తమ రైడ్ కు  ముందు , తరువాత ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడంతో పాటు , మాస్కు ధరించి మాత్రమే వాహనం ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణీకులు తమ లగేజీని తామే కారులో పెట్టుకోవాలి. కారు వెనుక సీట్లో మాత్రమే ప్రయాణీకులు కూర్చునేందుకు అనుమతిస్తారు. అలాగే ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా ఓ క్యాబ్‌లో డ్రైవర్‌తో సహా ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. తమ సవారీ బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు యాప్‌పై తాము ఉన్న ప్రదేశం, చేరాల్సిన గమ్యం చెబ్తూ, తాము చెల్లించాలనుకునే మొత్తం, తమ డ్రైవర్‌ను ఎంచుకో నే సదుపాయాన్నిఇన్‌డ్రైవర్ యాప్ లో కల్పిస్తున్నారు.  డ్రైవర్ రేటింగ్ లేదా తాము చెల్లించాలనుకున్న మొత్తం, తమ గమ్యస్థానం చేరడానికి పట్టే సమయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రయాణీకులు తమ రైడ్స్‌ను ఎంచుకునే అవకాశం ఈ యాప్‌లో ఉన్నది.logo