గురువారం 02 జూలై 2020
Telangana - May 28, 2020 , 00:29:38

రైతన్నకు జీఎస్టీ దెబ్బ

రైతన్నకు జీఎస్టీ దెబ్బ

  • వ్యవసాయోత్పత్తులపై ఎడాపెడా పన్నులు
  • ఏటా 15 వేల కోట్ల వసూళ్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్నం పెట్టే రైతన్నను కేంద్రం దగా చేస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో దారుణంగా మోసం చేస్తున్నది. ఉత్తర భారతానికి చెందిన రమణ్‌దీప్‌మన్‌ అనే రైతు ట్విట్టర్‌ ద్వారా ఇటీవల పీఎంవో దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లారు. దీంతో ఇది దేశమంతటా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలోని రైతులు ఏటా జీఎస్టీ రూపంలో ఏకంగా రూ.15 వేల కోట్లను చెల్లిస్తున్నారు. రైతన్నలు కొనే వ్యవసాయ పరికరాలపై భారీగా జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే వరి, గోధుమ, మొక్కజొన్న వంటి రకరకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని విక్రయించేటప్పుడు రైతన్నలు కొనుగోలుదారుల నుంచి ఎలాంటి జీఎస్టీని వసూలు చేయరు. అంటే.. అంతకుముందు వ్యవసాయ పరికరాల్ని కొన్నప్పుడు కట్టిన జీఎస్టీని మళ్లీ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం లేనే లేదు. జీఎస్టీని చెల్లించడమే తప్ప తిరిగి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌  క్రెడిట్‌ రూపంలో ఆ సొమ్మును వెనక్కి రాబట్టుకునే ఆస్కారమే లేదు. ఇలా గత నాలుగేండ్ల నుంచి ఏటా దేశీయ రైతుల్నుంచి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో సుమారు రూ.60 వేల కోట్లను అన్యాయంగా వసూలు చేసిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించి తమకు ఊరట కలిగించాలని రైతులు కోరుతున్నారు. 

దేనిపై ఎంత శాతం జీఎస్టీ?

ఎరువులు
5 %
ట్రాక్టర్లు
12%
పంపులు
12%
డ్రిప్‌/స్ప్రింక్లర్‌  
12 %
వ్యవసాయ పనిముట్లు 
12%
రసాయనాలు 
18%
ఫిరోమోన్‌ ట్రాప్స్
18%
పెస్టిసైడ్‌ రక్షణ పరికరాలు
18%


logo