గురువారం 09 జూలై 2020
Telangana - May 26, 2020 , 16:03:39

నారాయణ పేటలో నాలుగు నెలల పసివాడికి కరోనా

నారాయణ పేటలో నాలుగు నెలల పసివాడికి కరోనా

నారాయణ పేట : పొట్ట కూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోయిన కార్మికులకు లాక్ డౌన్ పెను శాపంగా మారింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు పనులు లేక స్వస్థలాలకు తరలి వస్తున్నారు. దీంతో పని చేసే చోట కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నారు. తాజాగా నారాయణ పేట జిల్లాలో నాలుగు నెలల పసివాడికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం ముంబై నుంచి  జాక్లైర్ కు వచ్చిన వలస కూలీ, అతని కుమారుడికి  పరీక్షలు నిర్వహించగా  బాలునికి  కరోనా పాజిటివ్ గా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం వారిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.


logo