గురువారం 09 జూలై 2020
Telangana - May 24, 2020 , 19:17:00

వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలు

వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలు

రాజన్నసిరిసిల్ల : లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయాలు తెరుచకోలేని పరిస్థితి నెలకొంది. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందు రాకుండా అర్చకులు ఆన్ లైన్ లో పూజలు నిర్వహించి భగవంతుడి దీవెనలు అందజేస్తున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవడంతో అర్చకులు వారి గోత్రనామాలపేర ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలోని అద్దాలమండపంలో అర్చకులు అభిషేకపూజలు, అన్నపూజలు, నాగిరెడ్డి మండపంలోని అమ్మవారి వద్ద కుంకుమపూజలు, కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన కార్యక్రమాలు నిర్వహించారు. 


logo