బుధవారం 15 జూలై 2020
Telangana - May 24, 2020 , 15:38:17

జయశంకర్‌ జీ.. దయచేసి అతనికి సహాయం చేయండి.. కవిత ట్వీట్‌

జయశంకర్‌ జీ.. దయచేసి అతనికి సహాయం చేయండి.. కవిత ట్వీట్‌

హైదరాబాద్‌ : సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలంగాణ వ్యక్తికి తక్షణమే సహాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. తెలంగాణకు చెందిన రవి అనే వ్యక్తి.. బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి రవి తన యజమాని నుంచి వేధింపులకు గురవుతున్నాడు. దీంతో బాధితుడు రవి.. తనను కాపాడాలని కోరుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. 

రవి ఆవేదనపై మాజీ ఎంపీ కవిత స్పందిస్తూ.. ఆ వీడియోను పోస్టు చేశారు. రవి సౌదీ అరేబియాలో చిక్కుకున్నాడు. అతన్ని రక్షించేందుకు వారం రోజుల నుంచి తమ ఎంబసీ ద్వారా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం అతని పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సమయంలో మీరు జోక్యం చేసుకోవాలి. దయచేసి రవికి సహాయం చేయాలని జైశంకర్‌కు కవిత విజ్ఞప్తి చేశారు. 


logo