మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 20:36:55

41,76,778 ఎకరాల్లో వరి పంట సాగు!

41,76,778 ఎకరాల్లో వరి పంట సాగు!

హైదరాబాద్‌ : సమగ్ర వ్యవసాయ విధానంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సమగ్ర వ్యవసాయ విధానం ప్రణాళిక సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. రైతులకు కష్టం లాభదాయకం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. వానా కాలంలో రాష్ట్రంలో 1.30 కోట్ల ఎకరాల్లో పంట సాగుకు అంచనా వేసినట్లు చెప్పారు. వరి పంట 41,76,778 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. కందులు 12,51,958 లక్షల ఎకరాల్లో, సోయాబీన్‌ 4,08,428 ఎకరాల్లో, పత్తి 65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించినట్లు నిరంజన్‌ రెడ్డి తెలిపారు. 


logo