బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 18:25:00

ఇఫ్లూలో కరోనా కట్టడే ధ్యేయం

ఇఫ్లూలో కరోనా కట్టడే ధ్యేయం

  • అందుబాటులోకి థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్లు
  • స్వయంగా పర్యవేక్షిస్తున్న వీసీ ప్రొఫెసర్‌ సురేశ్‌కుమార్‌

హైదరాబాద్ : ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో కరోనా మహమ్మారిని నిలువరించడమే ధ్యేయంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పని ప్రదేశాలతో పాటు పరిసరాల్లో రెగ్యులర్‌గా శానిటైజేషన్‌ చేపట్టడంతో పాటు, ఉద్యోగులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు చేపడుతూ, రెగ్యులర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ వర్క్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటున్నారు. వీటన్నింటినీ ఇఫ్లూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఇ. సురేశ్‌కుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తుండడం విశేషం.


logo