సోమవారం 01 జూన్ 2020
Telangana - May 21, 2020 , 20:33:41

కాళేశ్వరంలో ఆన్‌లైన్‌ అభిషేకాలు

కాళేశ్వరంలో ఆన్‌లైన్‌ అభిషేకాలు

జయశంకర్‌ భూపాలపల్లి : కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో దర్శనాలను నిలిపివేసిన క్రమంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 4 నుంచి ఆన్‌లైన్‌ అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు నలుగురు ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్నారని, వారి గోత్రనామాల మీద ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఇతరత్రా పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దీని ద్వారా ఆలయానికి రూ.4వేల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు చెప్పారు.logo