మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. గత బుధవారం లాహే లాహే పాటను మేకర్స్ ఇటీవల విడుదల చేయగా.. లిరికల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ పాట తొమ్మిది మిలియన్ల మార్క్‌ను దాటింది. శివుడిని స్తూతిస్తూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.
పరమేశ్వరుడి రూపాన్ని తన పాటతో పొడుగుతూ మెగాస్టార్ చిరంజీవికి మ్యాచ్ అయ్యేలా అద్భుతంగా రాయగా.. హైదరాబాద్ శివారులోని కోకాపేట ప్రాంతంలో వేసిన ఆలయ సెట్లో సాంగ్‌ను చిత్రీకరించారు. మెగాస్టార్ డాన్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి కష్టమైన స్టెప్పులనైనా అలవోకగానే వేసే మెగాస్టార్ ఈ సినిమాలో తనదైన డాన్సింగ్ చమక్కులు చూపించడం ఖాయమని ఈ లిరికల్ సాంగ్‌లో చిన్న డాన్స్ బీట్ చూస్తేనే అర్థమవుతోంది. ఫోక్ మెలోడీగా సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా.. ఈ పాటను హారిక నారాయణ్, సాహితీ చాగంటి ఆలపించారు.
సీనియర్ నటి సంగీత, హీరోయిన్ కాజల్ సంప్రదాయ వస్త్రధారణలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ తెరక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్పై రాంచరణ్, నిరంజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా.. చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.