ఆదివారం 31 మే 2020
Telangana - May 20, 2020 , 22:37:14

రోడ్డు ప్రమాదంలో తండ్రీ ,కొడుకు మృతి

 రోడ్డు ప్రమాదంలో తండ్రీ ,కొడుకు మృతి

 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది.  షాద్ నగర్ కు చెందిన తండ్రి కొడుకులు మృతి చెందారు.  హైదరాబాద్ నుంచి కర్నూల్   వైపు వెళ్తున్న డిసిఎం స్కూటీని ఢీ కొట్టడంతో సల్ల వరుణ్ (11)  ఆక్కడికక్కడే మృతి చెందగా . తండ్రి పాండు (41)  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo