శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 20, 2020 , 13:12:36

జగదీశ్ మార్కెట్ లో నిబంధనలు బేఖాతార్

జగదీశ్ మార్కెట్ లో నిబంధనలు బేఖాతార్

హైదరాబాద్ : ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలతో కూడిన సడలింపులకు అనుమతినిచ్చింది. అయితే కొందరు ఈ అవకాశాన్నిదుర్వినియోగం చేస్తూ లాక్ డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. హైదారాబాద్ జగదీశ్ మార్కెట్ లో వినియోగాదారులు, విక్రయదారులు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తు్న్నారు. భౌతిక దూరం పాటించకుండా దుకాణాల ముందు గుంపులు గుంపులుగా ఉన్నావిక్రయదారులు పట్టించుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే కరోనా మహమ్మారి మరింతగా విస్తరించే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా వినియోగదారులు, కొనుగోలు దారులు పక్కాగా నిబంధనలు పాటించి కరోనా రహిత రాష్ట్రానికి తోడ్పడాలి.


logo