శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 10:10:58

ఆఖరి గింజ వరకు కొంటాం..అన్నదాతలను ఆదుకుంటాం

ఆఖరి గింజ వరకు కొంటాం..అన్నదాతలను ఆదుకుంటాం

వరంగల్ రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ వైళ్తుండగా దారిలో పర్వతగిరి మండలం రావుల సీక్యా తండా రైతులతో కాసేపు ఆగి మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలు వేసి రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. ధాన్యం కొనుగోలు, తాజాగా వేయనున్న పంటలు వంటి పలు అంశాలపై రైతులతో చర్చించారు. ధాన్యం కొనుగోలు లో ఇబ్బందులు వస్తున్నాయని, కాంటా పెట్టడం ఆలస్యమవుతుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. క్రమేణా సమస్యలు తగ్గుతున్నాయని, గోదాముల కొరతను ప్రభుత్వం తీరుస్తుందని మంత్రి వారికి భరోసా కల్పించారు. గోదాములు మరిన్ని నిర్మించడానికి ప్రభుత్వం సిద్దపడినట్లు వెల్లడించారు. కొంత ఓపిక పట్టాలని, ఆఖరు గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.


logo