శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 23:25:41

"క్రెడ్ఆర్ బైబ్యాక్ ప్లస్‌ " ప్రోగ్రామ్ లాంచ్


హైదరాబాద్: యుజ్డ్ వెహికల్ బ్రాండ్ క్రెడ్ ఆర్ తమ వినియోగదారులకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. "క్రెడ్ఆర్ బైబ్యాక్ ప్లస్‌ " పేరుతో  హైదరాబాద్‌లో ఉన్న  క్రెడ్ఆర్ షోరూమ్‌లలో కార్యక్రమాన్నిఅమలు చేస్తున్నది . ఈ బైబ్యాక్ ప్రోగ్రామ్‌లో భాగంగా వినియోగదారులు ఖచ్చితమైన బైబ్యాక్ విలువను తమ ద్విచక్రవాహనాలకు కొనుగోలు సమయంలో పొందుతారు. సంజీవ్ రెడ్డి నగర్, నారాయణ గూడా, హఫీజ్‌పేట వంటి ప్రాంతాలలో ఉన్న క్రెడ్ఆర్  షోరూమ్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నది.   లాక్‌డౌన్ ముగిసిన తరువాత తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ప్రజా రవాణా వినియోగించుకోవడానికి బదులుగా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను తీసుకోవడానికి ప్రజలు ప్రాధాన్యతనిస్తారని క్రెడ్ ఆర్ భావిస్తున్నది. "అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా మాత్రమే గాక, ప్రపంచ శ్రేణి మౌలిక వసతుల పరంగా కూడా హైదరాబాద్ ఖ్యాతిగడించింది. ఇక్కడి వినియోగదారులు టెక్నాలజీ ప్రియులు, ఎల్లప్పుడూ సృజనాత్మక ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. ప్రజా రవాణా వినియోగం పట్ల అమలవుతున్న నిబంధనల కారణంగా ద్విచక్రవాహనాన్ని వ్యక్తిగత రవాణా మార్గంగా మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా , ఖర్చులేకుండా వినియోగించుకుంటున్నారని క్రెడ్ ఆర్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శశిధర్ నందిగం అన్నారు. "మా వినియోగదారులకు నగదుకు తగ్గ విలువనందించే ఉత్పత్తులను అందించాలనేది మా లక్ష్యం, ఇది ఇప్పటి వరకూ మేము ఆవిష్కరించిన అన్ని ఉత్పత్తులలోనూ ఉత్ప్రేరకంగా నిలిచింది. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితి కారణంగా మా ఉత్పత్తులకు అసాధారణ డిమాండ్ లభించింది. ఇది మా వినియోగదారులకు మరింత విలువనందించేలా ఉత్పత్తులను అందించడానికి స్ఫూర్తినందించింది. అతి తక్కువ  ధరలు అందిస్తున్న మొట్టమొదటి కంపెనీగా క్రెడ్ ఆర్ నిలుస్తున్నదని" ఆయన పేర్కొన్నారు.

 


logo