బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 19:55:23

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి: రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు

 ప్రభుత్వ నిబంధనలు పాటించాలి: రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు

 హైదరాబాద్:  క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ బేష్షుగా పని చేశారని,  రవాణా శాఖలో ఉన్న సిబ్బందితో లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన  పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం సమష్టి కృషితోనే సాధ్యమైందని రవాణా శాఖ కమిషపనర్ ఎం.ఆర్.ఎం.రావు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్రాన్స్ పోర్ట్ భవన్ నుంచి ఆయా జిల్లాల ఆర్టీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన అక్కడి పరిస్థితులతో పాటు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకోవడమే కాకుండా వారికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎసెన్షియల్ గూడ్స్ విషయంలో సక్సెస్ పుల్‌గా ప‌ని చేయడం జరిగిందని చెబుతూ ప్రస్తుతం కూడా ఇదే రకమైన సేవలు అందించడానికి కృషి చేయాలని కోరారు.  కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర సేవల్ని మెరుగ్గా అందించడం జరుగుతోందన్నారు.  ఆర్టీఏ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చేసే వాహనదారులతో పాటు సిబ్బంది ఆరోగ్యం కూడా ముఖ్యంగా భావించి ప్రభుత్వ మార్గనిర్ధేశకాల మేరకు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌, భౌతిక‌ దూరం పాటించడం, మాస్కులు, శానిటైజర్ల వాడకం వంటి చర్యల్ని తప్పకుండా అమలుపరుస్తున్నట్లు చెప్పారు. నగరంలో రవాణా శాఖ, పోలీస్ డిపార్ట్‌మెంట్ సమన్వయంలో కలిసి పని చేస్తున్నట్లు, ఆటో డ్రైవర్లు, ప్ర‌యాణీకులు ప్రభుత్వ నిబంధనలు తూ.చ త‌ప్ప‌క పాటించాల‌ని, లేని ప‌క్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు..  ప్రభుత్వ నిబంధనలు, సూచన‌లను పాటించడం సామాజిక బాధ్యత‌ అన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవల్నిఅందిస్తున్నట్లు చెబుతూ ఈ మేరకు రిజిస్ట్రేషన్స్, లెర్నింగ్, పర్మినెంట్ లైసెన్స్లు, ఇతరత్ర సేవ‌లు అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నదరిమిలా అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ ఆదేశాలనకనుగుణంగా వ్యవహరించాలని రవాణా శాఖ కమిషపనర్ ఎం.ఆర్.ఎం.రావు సూచించారు.logo