భువనగిరి టౌన్/భువనగిరి అర్బన్, ఏప్రిల్ 2 : ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ వెంటనే కొవిడ్ టీకా వేయించుకోవాలని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని రహదారి బంగ్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి దశ కంటే 2వ దశ కరోనా వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉందన్నారు. నాలుగైదు రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు 200 నుంచి 1000కి పెరగడం దీన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికే గాంధీ, ఇతర ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ బెడ్లు 50 శాతానికి పైగా నిండాయని చెప్పారు. ముఖ్యంగా యువకులు భౌతికదూరం, మాస్క్ మరిచారన్నారు. శానిటైజర్, మాస్క్, భౌతికదూరంతోనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది, దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంతవరకు నమోదు కాలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్‌తో భారతదేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్న ఆయన ముఖ్యంగా హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ద వరల్డ్‌గా మారిందన్నారు. చిన్న పిల్లల కోసం యూరప్‌లో సింగిల్శాట్ వ్యాక్సిన్ ఆమోదం పొందిందని చెప్పారు. ప్రతి 3000 మందికి ఒక సబ్‌సెంటర్, ప్రతి వెయ్యి మందికి ఒక ఆశవర్కర్ అందుబాటులో ఉందన్నారు.
సాగర్ ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు. ఉద్యమ చరిత్ర కలిగిన నాయకుడు నోముల నర్సింహయ్య అని, ఆయన కుమారుడు భగత్‌ను ప్రజలు ఆదరిస్తారన్నారు టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, ఇది గుర్తించే గతంలోనే టీఆర్ఎస్కు పట్టం కట్టారని, మళ్లీ పట్టం కడతారన్నారు. అనంతరం భువనగిరి జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్యను పరామర్శించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ అధ్యక్షులు గోమారి సుధాకర్‌రెడ్డి, జనగాం పాండు, మాజీ కౌన్సిలర్ లయిఖ్ అహ్మద్, ధనుంజయ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన
మయన్మార్ మిలిటరీతో అదానీ గ్రూప్ డీల్.. బయటపడిన సంచలన నివేదిక
దేశభక్తులకే పార్లమెంట్.. హాంకాంగ్‌పై చైనా పెత్తనం
బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు